ఆగస్టు నెలలో ధనస్సు రాశి వారికి ఉద్యోగంలో పురోగతి, ఆర్థిక లాభాలు, కుటుంబంలో సంతోషం ఉంటాయి. కెరీర్, ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి..నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్తప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
కుజుడు, రాహువు, శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆగస్టు నెలంతా ఆశించిన విధంగా గడిచిపో తుంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ రుగుతుంది. ఏ రంగానికి చెందినవారైనాకీ ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు తగ్గి మంచి లాభాలు వస్తాయి .ఆర్థిక విషయంలో కుటుంబంఆదాయం పెరిగే అవకాశం ఉంది.కుటుంబంలో ఆనందం, ప్రశాంతత ఉంటాయి.
ఉద్యోగస్తులకు కార్యాలయంలతో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచిప్రశంశలు అందుకునే అవకాశం ఉంది. వ్యాపారాల విషయంలో నష్టాలు తగ్గి, లాభాల బాటపడతాయి. కుటుంబ పరిస్థితులు అన్ని విధాలుగానూ అనుకూలంగా మారుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. పుణ్య కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు.
ధనస్సు రాశి వారు ఆగస్టు 2026 లో తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. సమాజంలో ఉన్నత వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు సాయం చేయడం జరుగుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి.
పిల్లలు చదువుల్లో పురో గతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అను కూలిస్తాయి. బంధుమిత్రుల్ని ఆర్థికంగా ఆదుకుంటారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
పరిహారం : ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్నిపఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
