జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల ( ఆగస్టు 2026)లో తులా రాశివారికి శుభ ఫలితాలుంటాయి. కెరీర్ పరంగా స్థిరత్వం కలిగే అవకాశం ఉంది. గ్రహాల సంచారం ఈ రాశికి అనుకూలంగా ఉన్నందువల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
తులారాశివారికి ఆగస్టు నెల కలిసివస్తుంది. ఈ నెలంతా గురుడు, బుధుడు, కుజుడు, శని,సూర్యడు గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగం, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. .అధికారులకు మీ పనితీరు, సమర్థత నచ్చుతాయి. సమాజంలో ఉన్నత స్థాయి గుర్తింపు లభించే అవకాశం ఉంది. భూ క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఎప్పటినుంచో ఉన్న కష్టాల నుంచి ఉపశమనం కలుగడం... ఆర్థిక పరిస్థితి బలపడటం వంటిశుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు నూతన బాధ్యతలు స్వీకరిస్తారు.
వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల అనేక విధాలుగా ఆదాయం కలిసి వచ్చి ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి.
మీ కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీకు స్నేహితులు, బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ ఇంటిక వచ్చే అతిథుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. మీరు మానసికంగా బలంగా ఉంటారు.
నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు మంచి పేరు తెచ్చుకుంటారు. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆశించిన విధంగా పురోగతి సాధిస్తారు. మీ ప్రేమ సంబంధాలు బలపడే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
పరిహారం : ప్రతిరోజూ విష్ణు సహస్రనామం .. ప్రతి గురువారం దక్షిణామూర్తి స్త్రోత్రం పఠించాలి. లేదా శ్రద్దగా వినాలి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
