హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాల గడువును మరోసారి పొడిగించారు. ఈ నెల15 వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఇలా అన్ని రకాల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు ఈ గడువు వర్తిస్తుందని బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. అడ్మిషన్ల ప్రక్రియలో టెన్త్ మార్కులు, జీపీఏ ఆధారంగానే సీట్లు కేటాయించాలని, ప్రవేశాల కోసం ఎలాంటి రాత పరీక్షలు నిర్వహించకూడదని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తప్పనిసరిగా ‘యాంటీ డ్రగ్ డిక్లరేషన్’ తీసుకోవాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు
