సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం

హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఆదివారం (ఆగస్ట్ 2) తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పొటెత్తారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. 

తెలంగాణ సంప్రదాయాలకు సంస్కృతి ఆచారాలకు ఆషాఢ మాస బోనాలు ఒక ప్రతిక అని అన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వం తరుఫున అమ్మవారిని కోరుకుంటున్నానని తెలిపారు. ఎవరి వృత్తుల్లో వారు విజయం సాధించాలని.. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని ఆ అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తున్ననని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 

హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇవ్వడంలో ముందుంటారని.. బోనాల ఉత్సవాల్లో కులాలకతీతంగా మతలకతీతంగా భాగస్వామ్యమై జరుపుకుంటారన్నారు. గతంలో ఈ ప్రాంతంలో అనేక విపత్తులు వచ్చిన అమ్మవారు ఆదుకున్నారని.. ఇప్పుడు కూడా ప్రజలందరిపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలన్నారు. ఎల్ నినో విపత్తు వచ్చినా.. ఇలాంటి ఇబ్బందులు కలగవద్దని బోనాల ఉత్సవాల సందర్భంగా అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. ప్రకృతి వైపరీత్యం వచ్చినా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని కోరారు. 

మరిన్ని వార్తలు