- ఉప్పల్ నల్లచెరువు పునరుజ్జీవంపై సీఎం ట్వీట్
హైదరాబాద్, వెలుగు: ఆక్రమణల నుంచి చెరువులను కాపాడి, వాటికి మళ్లీ జీవం పోయడం ద్వారా హైదరాబాద్ భవిష్యత్‌ను కాపాడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉప్పల్ నల్లచెరువు పునరుజ్జీవంపై శనివారం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. చెరువుల పునరుద్ధరణతో హైదరాబాద్‌కు కొత్త అందం వస్తోందని, ఇది తనకు ఎంతో సంతోషంగా ఉందని సీఎం తెలిపారు. నల్లచెరువు పునరుజ్జీవం కోసం కష్టపడ్డ హైడ్రా అధికారులు, సిబ్బందిని అభినందించారు.
నగరంలోని చెరువులను కాపాడుతూ భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించే బాధ్యతను హైడ్రా తీసుకుంటోందని సీఎం చెప్పారు. చెరువులను రక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, రాబోయే తరాల భవిష్యత్‌కు భరోసా ఇవ్వడమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ప్రతి చెరువును కాపాడటంతో పాటు ప్రజా ఆస్తుల్లో ప్రతి అంగుళాన్ని రక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు
