క్రిస్మస్ సమయంలో ప్రముఖ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ ఫ్రెషర్స్కు గుడ్ న్యూస్ చెప్పింది. తమ కంపెనీలో కొన్ని ఎంపిక చేసిన ఉద్యోగాల్లో చేరే ప్రెషర్స్కు హయ్యెస్ట్ ఎంట్రీ లెవెల్ శాలరీస్ను ఆఫర్ చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. దాదాపు 21 లక్షల దాకా ఈ ఎంట్రీ లెవెల్ శాలరీస్ ఉంటాయని ప్రకటించింది. సంవత్సరానికి 21 లక్షల ప్యాకేజ్ అంటే నెలకు లక్షా 75 వేల శాలరీ. ప్రెషర్స్కు ఎంట్రీ లెవెల్ పే ఈ స్థాయిలో ఆఫర్ చేయడానికి ముందుకొచ్చిన ఇండియన్ టెక్ కంపెనీ ఇప్పటికైతే ఇన్ఫోసిసే కావడం విశేషం.
2025లో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ పూర్తి చేసిన ఫ్రెషర్స్ కోసం ఇన్ఫోసిస్ ఆఫ్–క్యాంపస్ హైరింగ్ డ్రైవ్ నిర్వహించనుంది. వార్షిక వేతనం 7 లక్షల నుంచి జాబ్ రోల్ను బట్టి 21 లక్షల వరకూ ఉండనుంది. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (L1 to L3),డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ (ట్రైనీ) ఉద్యోగాల కోసం ఇన్ఫోసిస్ ఈ హైరింగ్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది.
జాబ్ రోల్–శాలరీ:
* స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L3(ట్రైనీ).. 21 LPA
* స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L2(ట్రైనీ).. 16 LPA
* స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ L1(ట్రైనీ).. 11 LPA
* డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ (ట్రైనీ).. 7 LPA
fiscal year 2026 ఫస్టాఫ్లో ఇన్ఫోసిస్ మొత్తం 12 వేల మంది ఫ్రెషర్స్ను హైర్ చేసుకుంది. 20 వేల మందిని హైర్ చేసుకోవాలని టార్గెట్ పెట్టుకుందని ఇన్ఫోసిస్ CFO జయేష్ సంఘ్ రజ్కా తెలిపారు.
