మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల జాతీయ రహదారి ఎన్ హెచ్ 44 దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 25న ఉదయం బాల్ నగర్ మండలం పెద్దపల్లి జియో పెట్రోల్ బంకు దగ్గర స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురి విద్యార్థులకు గాయాలు అయ్యాయి.
నారాయణపేట జిల్లా మరికల్ కు చెందిన మణికంఠ ప్రైవేటు కళాశాల విద్యార్థులు స్కూల్ బస్సులో హైదరాబాద్ జలవిహార్ కు వెళ్తుండగా.. ముందున్న వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి బస్సు బోల్తా పడింది .ఈ ప్రమాద సమయంలో బస్సులో 43 మంది విద్యార్థులు ఉన్నారు. గాయపడ్డ విద్యార్థులను బాలనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంఘటన స్థలానికి మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాదు నుంచి వనపర్తి వైపు వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి ప్రమాద స్థలం వద్ద ఆగి పరిస్థితిని సమీక్షించారు. భారీ క్రేను తీసుకువచ్చి స్కూల్ బస్సు ను పక్కకు తరలించారు. అనంతరం మంత్రి వనపర్తి బయలుదేరి వెళ్లిపోయారు. జడ్చర్ల సీఐ నాగార్జున, బాలనగర్ ఎస్సై లెనిన్, రాజాపూర్ ఎస్సై శివానంద ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
