‘‘ఆపరేషన్ క్రాక్‌డౌన్”.. సైబర్ క్రైమ్‌పై 16 జిల్లాల్లో ఒకేసారి ఆపరేషన్.. మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై ఫోకస్

 ‘‘ఆపరేషన్ క్రాక్‌డౌన్”.. సైబర్ క్రైమ్‌పై 16 జిల్లాల్లో ఒకేసారి ఆపరేషన్.. మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై ఫోకస్

హైదరాబాద్: ‘‘ఆపరేషన్ క్రాక్‌డౌన్”ను తెలంగాణ పోలీసులు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సైబర్ క్రైమ్‌పై 16 జిల్లాల్లో ఒకేసారి ఆపరేషన్ నిర్వహించారు. మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఫోకస్ పెట్టింది. 2025లో రాష్ట్రంలో 4 వేల 775 మ్యూల్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించింది. ఫిబ్రవరి 25 (బుధవారం) నిర్వహించిన ఆపరేషన్‌లో 18 వందల 88 అనుమానాస్పద ఖాతాలకి సైబర్ సెక్యూరిటీ బ్యూరో చెక్ పెట్టింది. 137 బ్యాంక్ బ్రాంచ్‌లలో పోలీసులు సోదాలు చేశారు.

దేశవ్యాప్తంగా 9 వేల 431 క్రైమ్ లింకులు ఉన్నట్లు వెల్లడైంది. తెలంగాణలోనే 782 కేసులతో మ్యూల్ అకౌంట్లకు ఈ సంబంధం ఉన్నట్లు సైబర్ క్రైం గుర్తించింది. 137 పోలీస్ టీమ్స్, 512 మంది సిబ్బందితో ఈ సోదాలు నిర్వహించారు. కొన్ని బ్రాంచ్‌లలో వందల సంఖ్యలో మ్యూల్ ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు.

►ALSO READ | హైకోర్టు ఆదేశాల మేరకే సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో పనులు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

సుల్తాన్ బజార్‌లో ఒకే అకౌంట్‌కు 496 ఫిర్యాదులు, సూర్యాపేటలో 4 బ్రాంచ్‌లలో 298 అనుమానాస్పద ఖాతాలను గుర్తించారు. చిన్న బ్యాంకులు RTGS కోసం నేషనల్ బ్యాంకుల సిస్టమ్ వినియోగించడం, సరైన వెరిఫికేషన్ లేకపోవడంతో సైబర్ నేరగాళ్లు మ్యూల్ అకౌంట్స్తో దందా చేస్తున్నారు.