నల్గొండ జిల్లాలో మిల్లర్ల మాయాజాలం.. రూ.43 కోట్ల ప్రభుత్వ ధాన్యం అమ్ముకున్న నిందితులు అరెస్టు

నల్గొండ జిల్లాలో మిల్లర్ల మాయాజాలం.. రూ.43 కోట్ల ప్రభుత్వ ధాన్యం అమ్ముకున్న నిందితులు అరెస్టు

ప్రభుత్వానికి, రైతులకు మధ్య వర్తులుగా ఉంటూ ధాన్యం కొనుగోలు చేసిన మిల్లర్లు.. ప్రభుత్వానికి 43 కోట్ల రూపాయల మేర ఎగనామం పెట్టడం సంచలనంగా మారింది. మిల్లులలో ఉన్న ధాన్యాన్ని మిల్లుల నుంచే దారి మళ్లించిన బాగోతాన్ని కనిపెట్టిన సివిల్ సప్లై అధికారులు.. పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. కనీస మద్ధతు ధరతో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొని.. ప్రభుత్వానికి అందించకుండా అమ్ముకుని జేబులు నింపుకున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం (ఫిబ్రవరి 25) తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ (TGSCSCL), నల్గొండ జిల్లా మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.  జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్  ఆదేశాల మేరకు కె.శివరాం రెడ్డి, SDPO, నల్గొండ పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలు నిందితులను పట్టుకున్నాయి. ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు.

ఎస్పీ శరత్ చంద్ర పవార్ కామెంట్స్:

  • నల్గొండ మండలం దోమలపల్లి గ్రామ శివారులో నిందితులను అదుపులోకి తీసుకున్నాం 
  •  అరెస్టు చేసిన నిందితులు కందుకూరి మహేందర్, కందుకూరి పద్మ (దంపతులు)
  • మిగతా నిందితులు మాశెట్టి రాధా కృష్ణ, మేడమ్ కృష్ణమూర్తి, ఇడుకుళ్ళ దామోదర్, కందుకూరి రవి కుమార్, బూరుగు బాలకృష్ణ పరారీలో ఉన్నారు.
  •  త్వరలో పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేస్తాం .. ప్రభుత్వానికి నష్టం కలిగిస్తానంటే ఊరుకోం  
  •  నిందితుల నుంచి లక్షా 9 వేల రూపాయలు,  మూడు సెల్ ఫోన్లు, బెలెనో కారు (TG-07-A-9927) స్వాధీనం చేసుకున్నాం
  •  2022-23 రబీ సీజన్‌లో సుమాంజలి పార్ బాయిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ – ఆర్జాలబావి, వరలక్ష్మి పార్ బాయిల్డ్ మిల్ – చిట్యాల,  మనోహర ఆగ్రో ఫుడ్ ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ – మునుగోడు.. ప్రభుత్వానికి ఈ మిల్లర్లతో కస్టమ్ మిల్లింగ్ ఒప్పందం జరిగింది.
  •  కందుకూరి మహేందర్ ప్రధాన పాత్రధారిగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ ఏజెంట్/మర్చంట్‌గా రైతుల నుంచి కనీస మద్దతు ధర (MSP) కింద IKP/PACS/DAO/NDCMS/FPOల ద్వారా ధాన్యం కొనుగోలు చేశారు.
  •  ప్యాడీకి సరిపడా బియ్యాన్ని ప్రభుత్వానికి అందించకుండా అక్రమంగా ధాన్యాన్ని అమ్ముకున్న మహేందర్  అండ్ టీమ్.
  •  ఈ మూడు రైస్ మిల్లుల ద్వారా మొత్తం 13,170.061 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సుమారు 43 కోట్ల రూపాయల నష్టం కలిగించారు .
  •  సుమాంజలి మిల్ ద్వారా– సుమారు రూ.22 కోట్ల నష్టం
  •  వరలక్ష్మి మిల్ – సుమారు రూ.19.33 కోట్ల నష్టం
  •  మనోహర మిల్ – సుమారు రూ.1.47 కోట్ల నష్టం.
  • అదుపులోకి ప్రభుత్వ ఖజానాకు గండికోట్టిన నేరస్థులు 
  •  నల్గొండ రూరల్, చిట్యాల, మునుగోడు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు చేసి రిమాండు 
  •  పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

 ఈ కేసును నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. దర్యాప్తులో నల్గొండ II టౌన్ CI రాఘవరావు, నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, నల్గొండ రూరల్ ఎస్. ఐ సైదాబాబు మొదలైనసిబ్బంది పాల్గొన్నారు.