సాగునీటి ప్రాజెక్టు పనులను స్పీడప్ చేయాలి : ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

సాగునీటి ప్రాజెక్టు పనులను స్పీడప్ చేయాలి : ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

యాదాద్రి, వెలుగు: భువనగిరి నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణ పనులను స్పీడప్​ చేసి గడువులోగా పూర్తి చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం యాదాద్రి జిల్లా కలెక్టరేట్ లో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జిల్లా అధికారులతో ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. 

రూ.485 కోట్లతో చేపడుతున్న బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. బునాదిగాని కాలువ నిర్మాణానికి సంబంధించి  కీలకమైన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. రైతులకు సకాలంలో సాగునీరు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.