విజయ్ దేవర కొండ, రష్మిక పెళ్లి ముచ్చట్లు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి. తాజా ముచ్చటేంటంటే.. విజయ్ దేవరకొండ తల్లి మాధవి తన కోడలికి అరుదైన కానుక ఇచ్చారు. అవేంటంటే.. వారసత్వంగా వస్తున్న గాజులు. ఈ బంగారు గాజులను రష్మికకు విజయ్ తల్లి మాధవి కానుకగా ఇచ్చారు. తమ ఇంట్లో కోడలిగా అడుగుబెట్టబోయే అమ్మాయికి ఇలా వారసత్వంగా వస్తున్న గాజులను ఇవ్వడం దేవరకొండ కుటుంబ ఆచారం అని తెలిసింది. ఇలా గాజులు ఇవ్వడం అంటే.. రష్మికను మనస్పూర్తిగా కోడలిని ఆహ్వానించడమేనట.
#Virosh Sangeet Function ??? pic.twitter.com/d012zzcz6F
— ??????????? (@_tweetz03) February 25, 2026
అత్త గాజులు బహుకరించిన సమయంలో రష్మిక భావేద్వేగానికి గురైంది. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 26న ఉదయం 10గంటల 10 నిమిషాలకు ఉదయ్పూర్‌లో హిందూ సాంప్రదాయం ప్రకారం విజయ్, రష్మిక వివాహం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 4.30 గంటలకు కొడవ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకుంటారు. బుధవారం నుంచే పెళ్లి సందడి మొదలైంది. హల్దీ వేడుక ఆటపాటలతో ఉత్సాహంగా సాగింది. అత్యంత సన్నిహితులు, స్నేహితులకు మాత్రమే విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లికి ఆహ్వానం అందింది. మార్చి 4న హైదరాబాద్ సిటీలో గ్రాండ్గా రిసెప్షన్ నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి.
►ALSO READ | VijayRashmika: సంగీత్ వేడుకలో 'వీడు మొరటోడు' పాటకు ' రష్మిక క్రేజీ డ్యాన్స్.. మురిసిపోయిన విజయ్ దేవరకొండ!
