మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నాడు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అందించాడు. ఓ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం నుంచి స్పెషల్ బర్త్‌డే పోస్టర్‌తోపాటు ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేయగా, మరోవైపు దర్శకుడు రవి నెలకుదిటి తెరకెక్కిస్తున్న ‘శ్రీ శ్రీ’ చిత్రం నుంచి కూడా తొలి పాట ‘బొమ్మ బొమ్మ’ను విడుదల చేసి మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేశారు మేకర్స్.
ఈ రెండు చిత్రాలకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండటం విశేషం. ‘ఆకాశంలో ఒకతార’ చిత్రం నుంచి వచ్చిన ‘చిట్టి చిట్టి చీమ’ పాట హృదయాన్ని హత్తుకునేలా ఉంది. శ్రీమణి లిరిక్స్ రాయగా, రమ్య బెహరా పాడింది. సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్ సమర్పణలో సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు.
ఇక ‘శ్రీశ్రీ’ చిత్రంలో దుల్కర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ‘బొమ్మ బొమ్మ’ పాటకు అనంతశ్రీరామ్ లిరిక్స్ అందించగా, కపిల్ కపిలన్ పాడిన విధానం ఆకట్టుకుంది. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
