ఆగస్టు 21న ఇరుముడి విడుదల

ఆగస్టు 21న ఇరుముడి విడుదల

రవితేజ హీరోగా శివ నిర్వాణ  దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై  నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇరుముడి’.  ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌ సినిమాపై అంచనాలు పెంచింది.  అయితే ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్‌‌పై వస్తున్న  ఊహాగానాలపై టీమ్ మరోసారి  క్లారిటీ ఇచ్చింది. ముందుగా అనౌన్స్‌‌ చేసిన ఆగస్టు 21నే ఈ చిత్రం వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల కానుందని ప్రకటించారు. 

ఈ విషయాన్ని తెలియజేస్తూ.. 25 డేస్ టు గో  పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.  ఇందులో రవితేజ  పేకాటలో నిమగ్నమైనట్టు కనిపిస్తున్నారు. తనను వెనుక నుంచి కూతురు పాత్ర పోషిస్తున్న చిన్నారి నక్షత్ర ప్రేమగా కౌగిలించుకోవడం ఆకట్టుకుంది. తండ్రీ-కూతుళ్ల బంధం కథలో ఎంత కీలకంగా ఉండబోతోందో ఈ పోస్టర్‌‌‌‌ ద్వారా చూపించారు. 

ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌‌గా నటిస్తుండగా, సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్​ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.