సింగరేణి ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం :సింగరేణి చీఫ్మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్కుమార్

సింగరేణి ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం :సింగరేణి చీఫ్మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్కుమార్

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి ఆస్పత్రుల్లో కార్మికులు, వారి కుటుంబాలకు కార్పొరేట్​స్థాయి వైద్య సేవలు అందిస్తున్నామని సింగరేణి చీఫ్​ మెడికల్​ఆఫీసర్(సీఎంవో) డాక్టర్ ​కిరణ్​రాజ్​కుమార్​అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్​ సింగరేణి ఏరియా ఆస్పత్రి, శ్రీరాంపూర్​ఆర్కే-8, జైపూర్​ఎస్టీపీపీ డిస్పెన్సరీలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఆర్కేపీ ఏరియా ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించి చికిత్స పొందుతున్న కార్మిక కుటుంబసభ్యులతో మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరు, సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డాక్టర్లు, సిబ్బందితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అన్ని వేళలా రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రత్యేక వైద్య సేవలు అవసరమైన సందర్భాల్లో రోగులను కార్పొరేట్ ఆస్పత్రులకు రిఫర్ చేసి అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆస్పత్రి డీవైసీఎంవోడాక్టర్​ మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.