పర్వతగిరి, వెలుగు : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి రైతు వేదికలో నిర్వహించిన 'రైతు నేస్తం' వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ సత్య శారదతో కలిసి పాల్గొన్న ఆయన, ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటి అవసరమున్న జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.
ఉద్యాన పంటలు, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులను శాలువాతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్‌లో కంప్లైంట్ బాక్స్ లేకపోవడంపై హెడ్మాస్టర్‌ను మందలించి, విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
