భద్రాచలం: సెప్టెంబర్ 18లోగా పీఆర్సీ, డీఏలు ఇవ్వాలి : రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్‌‌‌‌‌‌‌‌

భద్రాచలం: సెప్టెంబర్ 18లోగా పీఆర్సీ, డీఏలు ఇవ్వాలి : రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్‌‌‌‌‌‌‌‌

భద్రాచలం, వెలుగు : ఈ నెల 18లోగా పీఆర్సీ, ఆరు డీఏలు విడుదల చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌‌‌‌‌‌‌‌) రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ హెచ్చరించారు. భద్రాచలంలో శనివారం టీపీయూఎస్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 

సీపీఎస్‌‌‌‌‌‌‌‌ను రద్దు చేసి పాత పెన్షన్‌‌‌‌‌‌‌‌ విధానాన్ని (ఓపీఎస్‌‌‌‌‌‌‌‌) పునరుద్ధరించాలని, 317 జీవో బాధితులకు 190 జీవోను అమలు చేయాలని కోరారు. కేజీబీవీ, గురుకులం, మోడల్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. నూతన విద్యా విధానం-2020ను సమర్థవంతంగా అమలు చేస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేలా విద్యా సంస్కరణలు చేపట్టాలని సమావేశం తీర్మానించింది.