ఖిలా వరంగల్ (మామునూరు), వెలుగు: వరంగల్‌లోని కరీమాబాద్ కివి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కరాటేలో ప్రతిభ చాటారు. మంచిర్యాలలో నిర్వహించిన 5వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్–2026 పోటీల్లో 17 జిల్లాల నుంచి 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఇందులో కివి పబ్లిక్ స్కూల్‌కు చెందిన లలిత్, సాత్విక్, ఇసాక్, యోజిత్, వరుణ్ బంగారు పతకాలు సాధించారు. విజేతలను పాఠశాల ప్రిన్సిపల్ దాసి సతీశ్మూర్తి, వైస్ ప్రిన్సిపల్ అన్నదేవర ప్రవీణ్ కుమార్, కోచ్‌లు బండారి సంతోష్, రణదీప్ అభినందించారు.
