ఇస్రో జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేసింది.. మొత్తం 90 పోస్టులు.. ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్ ..

ఇస్రో జాబ్స్ నోటిఫికేషన్ వచ్చేసింది..  మొత్తం 90 పోస్టులు.. ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్ ..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వివిధ విభాగాల్లో సైంటిస్ట్/ ఇంజినీర్ -‘ఎస్​సీ’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 92 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్​లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఆగస్టు 1న ప్రారంభమై 17న ముగియనున్నది. 

పోస్టు పేరు: సైంటిస్ట్/ ఇంజినీర్ ఎస్​సీ.

మొత్తం ఖాళీలు: 90. 

విభాగాల వారీగా ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ 34, మెకానికల్ 26, కంప్యూటర్ సైన్స్ 13, సివిల్ 10, ఎలక్ట్రికల్ 04, రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండీషనింగ్ 02, ఆర్కిటెక్చర్ 02, సివిల్ (అటానమస్ బాడీ పీఆర్ఎల్) 01. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులు లేదా సీజీపీఏ 6.84 / 10తో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత విభాగంలో వాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 2026, ఆగస్టు 17 నాటికి 28ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 1. 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇతరులకు రూ.250. 

లాస్ట్ డేట్: ఆగస్టు 17. 

సెలెక్షన్ ప్రాసెస్:  గేట్ వాలిడ్ స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్  ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.isro.gov.inను సందర్శించండి.