ఆదిలాబాద్: పొంగిన వాగు.. దాటుడు ఎట్లా?

 ఆదిలాబాద్: పొంగిన వాగు.. దాటుడు ఎట్లా?

ఆదిలాబాద్ ​జిల్లా ఉట్నూర్‌‌ మండలం నర్సాపూర్‌‌(జె) సమీపంలోని వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో ఏటా వర్షాకాలంలో ఆ మార్గంలో రాకపోకలు సాగించే నాలుగు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రవాహం ఉధృతంగా ఉండడంతో మంగళవారం ఇలా ప్రమాదకరంగా ఒడ్డుకు చేరారు. 

ఏటా వర్షాకాలంలో తమకు నరకయాతన తప్పడం లేదని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు. -వెలుగు, గుడిహత్నూర్‌‌(ఉట్నూర్‌‌)