దేశాన్ని చుట్టొచ్చిన బైకర్..మందమర్రి సింగరేణి కార్మికుడు బైక్పై 25 వేల కి.మీ. యాత్ర పూర్తి..

దేశాన్ని చుట్టొచ్చిన బైకర్..మందమర్రి సింగరేణి కార్మికుడు  బైక్పై 25 వేల కి.మీ. యాత్ర పూర్తి..

కోల్‌‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సింగరేణి కార్మికుడు హరీశ్ 25 వేల కిలోమీటర్ల అఖిల భారత బైక్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసి స్వగ్రామానికి చేరుకున్నారు. శాంతిఖని గనిలో పంపు ఆపరేటర్‌‌గా పనిచేస్తున్న హరీశ్ ‘తెలుగు ట్రావెలర్ హరీశ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. సుమారు 100 రోజుల్లో బైక్‌‌పై దేశవ్యాప్తంగా 25 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఈ యాత్రలో దేశంలోని నాలుగు చార్‌‌ధామ్‌‌లు, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలతో పాటు అనేక చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక వారసత్వ ప్రాంతాలను సందర్శించారు. భారతదేశ వైవిధ్యం, సంస్కృతి, ఆధ్యాత్మిక సంపద, పర్యాటక విశేషాలను ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో యాత్ర అనుభవాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నిరంతరం పంచుకున్నట్లు హరీశ్ తెలిపారు.