ISSF‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో సోనమ్‌‌‌‌–హిమాన్షుకు కాంస్యం

ISSF‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో సోనమ్‌‌‌‌–హిమాన్షుకు కాంస్యం

హాంగ్‌‌‌‌జౌ: ఐఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా షూటర్ల జోరు కొనసాగుతోంది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ రైఫిల్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఫైన్లలో సోనమ్‌‌‌‌ ఉత్తమ్‌‌‌‌ మస్కర్‌‌‌‌–హిమాన్షు దిల్లాన్‌‌‌‌ జోడీ 441.2 పాయింట్లతో మూడో ప్లేస్‌‌‌‌లో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. ఇద్దరూ చెరో 220.6 పాయింట్లు సాధించారు.  చైనా 1, 2 జట్లు స్వర్ణం, రజతం గెలిచాయి. 

ఇండియాకే చెందిన ఎలావనిల్‌‌‌‌ వలరివన్‌‌‌‌ (190.5)–పార్త్‌‌‌‌ రాకేశ్‌‌‌‌ మానె (188.3) జంట 378.8 పాయింట్లతో నాలుగో ప్లేస్‌‌‌‌తో సరిపెట్టుకుంది. క్వాలిఫికేషన్స్‌‌‌‌లో సోనమ్‌‌‌‌ (317.2)– హిమాన్షు (317.4) సంయుక్తంగా 634.6 పాయింట్లు సాధించగా, ఎలావనిల్‌‌‌‌ (316.8)– పార్త్‌‌‌‌ (317.8) జోడీ 634.2 పాయింట్లు నెగ్గి ఫైనల్స్‌‌‌‌కు అర్హత సాధించారు. ఓవరాల్‌‌‌‌గా ఈ టోర్నీలో ఇండియా ఒక స్వర్ణం, ఒక రజతం, రెండు కాంస్యాలతో కొనసాగుతోంది.