బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ దరఖాస్తుల గడువు పెంపు

బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ దరఖాస్తుల గడువు పెంపు

హైదరాబాద్​, వెలుగు: 2026–27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ కోర్సులో ప్రవేశాల ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఆగస్టు 16 వరకు కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ వర్సిటీ పొడిగించింది. వర్సిటీ పరిధిలోని 4 కళాశాలల్లో మొత్తం 284 సీట్లు అందుబాటులో ఉండగా, వాటిలో 230 రెగ్యులర్, 54 సెల్ఫ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్ సీట్లు ఉన్నాయి.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లో 90, వనపర్తి జిల్లా మొజెర్లలో 80, మహబూబాబాద్ జిల్లా మల్యాలలో 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో 30 సీట్లు ఉన్నాయి. రాజేంద్రనగర్ కళాశాలలో ఎన్నారై కోటా కింద మరో ఆరు సీట్లను భర్తీ చేయనున్నారు.