న్యూఢిల్లీ: టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కెట్, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్ కాంట్రాక్ట్‌లను పొడిగించడం లేదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మంగళవారం స్పష్టం చేశాడు. వీళ్ల స్థానంలో కొత్త వారిని తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నామన్నాడు. లంక టూర్‌కు వెళ్లే టైమ్‌లో కొత్త కోచ్‌లు జట్టుతో ప్రయాణిస్తారని చెప్పాడు.
ఈ పదవులకు సంబంధించి రెండు, మూడు పేర్లు పరిశీలనలో ఉన్నా.. విమెన్స్ జట్టుకు సపోర్ట్ స్టాఫ్‌గా పని చేసిన శుభ్‌దీప్ ఘోష్ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. టెన్ డస్కెట్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కోచ్‌గా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఇంగ్లండ్‌లో టీ20, వన్డే సిరీస్‌లను కోల్పోయిన వెంటనే డస్కెట్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
