మా త్యాగాలకు గుర్తింపు, గౌరవం కల్పించండి..ఎమ్మెల్సీ కోదండరాంకు టీఎన్జీవో నేతల వినతి

మా త్యాగాలకు గుర్తింపు, గౌరవం కల్పించండి..ఎమ్మెల్సీ కోదండరాంకు టీఎన్జీవో నేతల వినతి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని టీఎన్జీవో జనరల్ సెక్రటరీ ఎస్ ఎం హుస్సేనీ  గుర్తుచేశారు. మంగళవారం నాంపల్లి టీజేఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ, ఉద్యమ కారుల కమిటీ మెంబర్ కోదండరాంను హుస్సేనీ, టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణయాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలిసి వినతి పత్రం అందచేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని, విజయానికి తమవంతు సేవలందించిన ఉద్యోగులకు తగిన గౌరవం, సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

తమ విజ్ఞప్తిని కమిటీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు. ఆంధ్రా పాలకుల ఆంక్షలు, ఇబ్బందులను తట్టుకొని తమ డ్యూటీలను బంద్ చేసి ఉద్యమంలో పాల్గొన్నామని నేతలు గుర్తుచేశారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ఈ అంశంపై కోదండరాం స్పందిస్తూ, తెలంగాణ ఉద్యమంలో విశేష కృషి చేసిన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. వచ్చిన ప్రతి వినతి పత్రాన్ని కమిటీ పరిగణలోకి తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.