తరౌబా: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో విండీస్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ (5/27) సూపర్ పెర్ఫామెన్స్‌తో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. పాక్ తొలి ఇన్నింగ్స్‌లో తన తొలి ఐదు ఓవర్లలో 27 రన్స్ ఇచ్చిన గ్రీవ్స్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. కానీ రెండో స్పెల్‌లో వరుసగా ఐదు ఓవర్లలో ఐదు మెయిడెన్ వికెట్లు తీశాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
ఈ ఫార్మాట్‌లో గ్రీవ్స్‌కు ఇది తొలి ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. 2016లో జొహనెబర్గ్‌లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వరుసగా నాలుగు మెయిడెన్ వికెట్లు తీసిన రికార్డును గ్రీవ్స్ బ్రేక్ చేశాడు. గ్రీవ్స్ సూపర్ పెర్ఫామెన్స్ దెబ్బకు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 80.1 ఓవర్లలో 282 రన్స్‌కు ఆలౌటైంది. షాన్ మసూద్ (109) సెంచరీ సాధించాడు.
తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్ 54.5 ఓవర్లలో 181 రన్స్‌కు ఆలౌటైంది. షామెర్ జోసెఫ్ (38) టాప్ స్కోరర్. అబ్బాస్ 5 వికెట్లు తీశాడు. తర్వాత 211 రన్స్ లక్ష్య ఛేదనకు దిగిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 31/3 స్కోరు చేసింది. కడపటి వార్తలందేసరికి బాబర్ ఆజమ్ (17 బ్యాటింగ్), రిజ్వాన్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
