పారా అథ్లెటిక్స్‌‌‌‌లో షాట్‌‌‌‌పుటర్‌‌‌‌ శర్మిల ధన్‌‌‌‌కర్‌‌‌‌‎కు స్వర్ణం

పారా అథ్లెటిక్స్‌‌‌‌లో షాట్‌‌‌‌పుటర్‌‌‌‌ శర్మిల ధన్‌‌‌‌కర్‌‌‌‌‎కు స్వర్ణం

పారా అథ్లెటిక్స్‌‌‌‌లో షాట్‌‌‌‌పుటర్‌‌‌‌ శర్మిల ధన్‌‌‌‌కర్‌‌‌‌ కొత్త చరిత్ర లిఖించింది. విమెన్స్‌‌‌‌ షాట్‌‌‌‌ఫుట్‌‌‌‌ ఎఫ్‌‌‌‌–57 విభాగంలో శర్మిల ఇనుప గుండును 9.81 మీటర్ల దూరం విసిరి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించింది. దాంతో పారా అథ్లెటిక్స్‌‌‌‌లో ఇండియాకు తొలి స్వర్ణం అందించిన పారా అథ్లెట్‌‌‌‌గా రికార్డులకెక్కింది. దాంతో గేమ్స్‌‌‌‌ పారా అథ్లెటిక్స్‌‌‌‌లో రెండు దశాబ్దాల పతక నిరీక్షణకు తెరపడింది. 

రెండేళ్ల వయసులోనే పోలియో బారిన పడిన శర్మిల ఆ తర్వాత వైవాహిక జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. శిల్పా షైలా (7.26 మీటర్లు)కు కాంస్యం లభించింది. తొలుత నైజీరియా అథ్లెట్‌‌‌‌ యూకారియా ఇయాజీకి (7.26 మీ) కాంస్య పతకాన్ని కేటాయించారు. 

కానీ ఇండియా అధికారులు నిరసన తెలపడంతో నిర్వాహకులు యూకారియా పెర్ఫామెన్స్‌‌‌‌ను సమీక్ష చేశారు. ఇందులో ఆమె ఫౌల్‌‌‌‌ అయినట్లుగా గుర్తించడంతో శిల్పకు మూడో స్థానం కేటాయించారు. దీనిపై నైజీరియా కూడా సమీక్షకు వెళ్లే అవకాశం ఉంది. ఎఫ్‌‌‌‌–57 వర్గీకరణ అనేది దిగువ అవయవాల వైకల్యాలు, అవయవ లోపాల అథ్లెట్ల కోసం ఉద్దేశించబడింది.