ఖమ్మం : శిథిల భవనంలో చదువు.. వానొస్తే సెలవు!

ఖమ్మం : శిథిల భవనంలో చదువు.. వానొస్తే సెలవు!

గతేడాది సెప్టెంబర్‌‌‌‌లో భవనం శిథిలావస్థకు చేరడంతో ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామపంచాయతీ గోపాలపురం ప్రాథమిక పాఠశాలకు విద్యాశాఖ ఆఫీసర్లు తాళం వేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలు అద్దె భవనంలో తరగతులు నిర్వహించిన ఉపాధ్యాయులు, తర్వాత సొంతంగా రూ.40 వేల ఖర్చుతో రేకుల షెడ్ నిర్మించి బోధన కొనసాగిస్తున్నారు. 

తాగునీరు, స్టేషనరీ వంటి అవసరాలను కూడా కాంపోజిట్ గ్రాంట్‌‌‌‌తోనే నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయురాలు ఇందిర తెలిపారు. కొత్త భవనం కోసం అధికారులను కోరితే తమ పరిధిలో లేదని, ఎంపీడీవోను కలవాలని సూచించారని చెప్పారు. వర్షం పడితే షెడ్‌‌‌‌లో తరగతులు నిర్వహించలేక స్కూల్‌‌‌‌కు సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది.    వెలుగు, ఖమ్మం ఫొటోగ్రాఫర్​