సెప్టెంబర్ 23 వరకు ఖైరతాబాద్ గణేష్ దర్శనం.. సొంత వాహనాల్లో వచ్చే భక్తులకు సూచనలు

సెప్టెంబర్ 23 వరకు ఖైరతాబాద్ గణేష్ దర్శనం.. సొంత వాహనాల్లో వచ్చే భక్తులకు సూచనలు

ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం సెప్టెంబర్ 23 వరకు ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్ తెలిపారు.   బడా గణేష్ దర్శనం కోసం ఈసారి 30 లక్షల మంది  వస్తారని.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 

బడా గణేష్ దర్శనానికి నాలుగు రూట్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మెట్రో స్టేషన్ నుండి కూడా దర్శనానికి రావచ్చునని పేర్కొన్నారు. బడా గణేష్ దర్శానికి సొంత వాహనాల్లో వచ్చేకంటే.. మెట్రో, MMTS, RTC స్పెషల్ బస్సు లలో భక్తులు రావాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ట్రాఫిక్ అంతరాయం తగ్గుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. 

బడా గణేష్ దర్శనానికి వీకెండ్స్ లో ఈవినింగ్ టైమ్ లలోనే ఎక్కువగా వస్తుంటారని.. అలా కాకుండా వీక్ డేస్ లలో కూడా భక్తులు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒకేసారి.. కార్ పులింగ్ ద్వారా రావాలని సూచించారు.

ఐమాక్స్ గ్రౌండ్, HMDA ప్లేస్ లో, NTR పార్క్ బ్యాక్ సైడ్, నెక్ లెస్ రోడ్ ప్రాంతాలలో పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెట్రో లో వచ్చే భక్తులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. VIP లకు ప్రత్యేక రూట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పది రోజులు భక్తులు సహకరించాలని కోరారు. బడా గణేష్ ట్రాఫిక్ ఆరెంజ్ మెంట్ కోసం 500 మంది ట్రాఫిక్  సిబ్బంది పనిచేయనున్నారు.