ఆగస్టు 5 నుంచి అప్పారెల్‌‌‌‌‌‌‌‌ ట్రేడ్ ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆగస్టు 5 నుంచి అప్పారెల్‌‌‌‌‌‌‌‌ ట్రేడ్ ఫెయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:  అప్పారెల్  మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ ఇండియా (ఏఎంఐ) ఆధ్వర్యంలో ‘అద్వైత్ 8.0’ ట్రేడ్ ఫెయిర్ వచ్చే నెల 5 నుంచి 7 వరకు చెన్నైలోని ఆర్‌‌‌‌‌‌‌‌కే కన్వెన్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో జరగనుంది. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్రదర్శనలో ముంబై, ఇండోర్, సూరత్ వంటి నగరాల నుంచి 220కి పైగా ప్రముఖ బ్రాండ్లు తమ తాజా ఫెస్టివ్ కలెక్షన్లను ప్రదర్శించనున్నాయి. 

రాబోయే పండుగల సీజన్, మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్‌‌‌‌‌‌‌‌లకు అనుగుణంగా రిటైలర్లు, మల్టీ-బ్రాండ్ అవుట్‌‌‌‌‌‌‌‌లెట్లకు (ఎంబీఓలు) నూతన వ్యాపార అవకాశాలు కల్పించడమే ఈ ట్రేడ్ ఫెయిర్ ముఖ్య ఉద్దేశం. దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న రిటైల్ మార్కెట్ అవసరాలను తీర్చడంలో అద్వైత్ 8.0 కీలక పాత్ర పోషిస్తుందని ఏఎంఐ వ్యవస్థాపకులు ధర్మేష్ నందు తెలిపారు.