టాటా సన్స్ చంద్రశేఖరన్ వేతనం రూ.158.66 కోట్లు... ఐదేళ్లలో రూ. 671.4 కోట్ల సంపాదన

టాటా సన్స్ చంద్రశేఖరన్ వేతనం రూ.158.66 కోట్లు... ఐదేళ్లలో రూ. 671.4 కోట్ల సంపాదన

న్యూఢిల్లీ:  టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ వార్షిక వేతనం మళ్లీ పెరిగింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి (2025–26) ఆయన మొత్తం రూ. 158.66 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో   రూ. 155.81 కోట్లు పొందారు.  

2022లో టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ శాలరీ వివరాలను వెల్లడించడం ప్రారంభించినప్పటి నుంచి ఆయనకు లభించిన అత్యధిక రెమ్యునరేషన్‌‌‌‌‌‌‌‌ ఇదే కావడం విశేషం. గడిచిన ఐదేళ్లలో ఆర్గనైజేషన్ నుంచి మొత్తంగా రూ. 671.4 కోట్లు ఆర్జించారు. ఆయన మొత్తం వేతనంలో రూ. 17.97 కోట్లు జీతం, ఇతర ప్రయోజనాలు ఉండగా, రూ. 140.69 కోట్లు లాభాల ఆధారంగా ఇచ్చే  కమిషన్‌‌‌‌‌‌‌‌ ఉంది. 

హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ టెక్ సీఈఓకే ఎక్కువ

హెచ్‌‌‌‌‌‌‌‌సీఎల్‌‌‌‌‌‌‌‌ టెక్ సీఈఓ సి. విజయకుమార్ 2025–26లో అత్యధికంగా రూ. 176 కోట్లు పొందారు.  పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సీఈఓ సందీప్ కల్రా (రూ. 148 కోట్లు), హీరో మోటోకార్ప్ పవన్ ముంజాల్ (రూ. 122 కోట్లు) తరువాతి స్థానాల్లో ఉన్నారు. ఆగస్టు 18న జరిగే టాటా సన్స్ ఏజీఎం లో చంద్రశేఖరన్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా కొనసాగడానికి వాటాదారుల ఆమోదం కోరనున్నారు.