ఆగస్టు 10, 11న ‘హలో మాల - చలో ఢిల్లీ’: ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం: మాల సంఘాల జేఏసీ

ఆగస్టు 10, 11న ‘హలో మాల - చలో ఢిల్లీ’: ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం: మాల సంఘాల జేఏసీ

బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: రాష్ట్రంలో అమలవుతున్న ఎస్సీ వర్గీకరణ చట్టం, రోస్టర్ విధానం వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆరోపించింది. మంగళవారం బషీర్‌‌‌‌బాగ్ ప్రెస్‌‌‌‌క్లబ్‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో జేఏసీ గౌరవాధ్యక్షుడు చెరుకు రాంచందర్‌‌‌‌, చైర్మన్ మందాల భాస్కర్ మాట్లాడారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేసిందన్నారు. దీనివల్ల 14 ఉద్యోగ నోటిఫికేషన్లలో మాల యువత అవకాశాలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు రోస్టర్ విధానాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 10, 11 తేదీల్లో హలో మాల-చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత పోస్టర్​ను ఆవిష్కరించారు. మాల సంఘాలు, విద్యార్థి, యువజన, ఉద్యోగ సంఘాల నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కమిటీ వర్కింగ్ చైర్మన్ మంత్రి నరసింహయ్య, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్ , నాయకులు సఖి గంగాధర్, తుమ్మ శ్రీనివాస్, సీపూరి ప్రణయ్, మాదాసు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.