ఇండియా స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజన్ సెమీస్‌లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన మెన్స్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శ్రీహరి 55.58 సెకన్ల టైమింగ్తో ఓవరాల్‌గా 13వ ప్లేస్‌లో నిలిచాడు. హీట్స్‌లో మాత్రం ఐదో ప్లేస్‌ను సాధించాడు. మెన్స్ 50 మీటర్ల బటర్ ఫ్లయ్ హీట్స్‌లో సాజన్ ప్రకాశ్ 24.94 సెకన్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌గా 28వ ప్లేస్‌తో వెనుదిరిగాడు.
పారా స్విమ్మర్లు ఆర్‌వీవీబీకే బుడిగినా (26.33 సెకన్లు), అలీ ఇమామ్ (28.41 సెకన్లు) ఫైనల్స్‌కు అర్హత సాధించారు. మెన్స్ 110 మీటర్ల హర్డిల్స్‌లో తేజస్ షిర్సే ఫైనల్ చేరినా పతకాన్ని సాధించలేకపోయాడు. హీట్స్‌లో 13.76 సెకన్ల టైమింగ్‌తో ఫైనల్ చేరిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు.
అయితే ఫైనల్‌కు ముందు జరిగిన వామప్‌లో తేజర్ ఎడమ పాదం ఎముకలో పగులు ఉన్నట్లు తేలింది. ఫిజియో సాయంతో పాదానికి గట్టిగా టేప్ కట్టించుకుని బరిలోకి దిగాడు. అయితే తొలి హర్డిల్స్ దాటిన తర్వాత నొప్పి తీవ్రం కావడంతో రేసులో వెనుకబడ్డాడు. అయినప్పటికీ పట్టుదలతో రేసును ముగించాడు.
