కరీంనగర్లోని భగత్ నగర్‌‌‌‌ ఆల్ఫోర్స్లో ఘనంగా జగన్నాథ రథయాత్ర

కరీంనగర్లోని భగత్ నగర్‌‌‌‌ ఆల్ఫోర్స్లో ఘనంగా జగన్నాథ రథయాత్ర

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్​లోని భగత్ నగర్‌‌‌‌ ఆల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ లో మంగళవారం జగన్నాథ రథయాత్ర, పుండరీపుర యాత్ర ఘనంగా జరిగింది. పాల్గొన్న చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్నాథుడి రథయాత్ర దేశంలోని అత్యంత ప్రాచీన హిందూ పండుగల్లో ఒకటని పేర్కొన్నారు. ఈ యాత్ర చేపడితే జగన్నాథుడు భక్తుల వద్దకు స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తాడని నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. విద్యార్థుల భజనలు, నృత్యాలు అలరించాయి.