కృష్ణానదిపై బరాజ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కర్నాటక మాజీ మంత్రిని కోరిన మంత్రి శ్రీహరి

కృష్ణానదిపై బరాజ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కర్నాటక మాజీ మంత్రిని కోరిన మంత్రి శ్రీహరి

మహబూబ్​నగర్, వెలుగు: తెలంగాణ, కర్నాటక సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో కీలకమైన కొల్పూరు-, కుర్తికొండ బ్రిడ్జ్  కమ్  బరాజ్  నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తయ్యేలా కర్నాటక ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆ రాష్ట్ర మాజీ మంత్రి బోసురాజును మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.

మంగళవారం ఆయన రాయచూర్​లో బోసురాజుతో భేటీ అయ్యారు. ఈ బ్రిడ్జ్  కమ్  బరాజ్​ నిర్మిస్తే రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. ఒకటిన్నర టీఎంసీ కెపాసిటీ గల ఈ బరాజ్ తో సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయని అన్నారు.