మినిమమ్‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్‌ చార్జీలతో ప్రైవేట్ బ్యాంకులకు రూ.4 వేల 949 కోట్ల ఆదాయం

మినిమమ్‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్‌ చార్జీలతో ప్రైవేట్ బ్యాంకులకు రూ.4 వేల 949 కోట్ల ఆదాయం

న్యూఢిల్లీ: బ్యాంకులు కస్టమర్ల నుంచి చార్జీల రూపంలో భారీగా సంపాదిస్తున్నాయి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయని అకౌంట్ల నుంచి వేల కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నాయి. ఇందులో ప్రైవేట్ బ్యాంకులు ముందుండగా, ప్రభుత్వ బ్యాంకులు కూడా పెద్ద దూరంలో లేవు. మినిమమ్‌‌‌‌‌‌‌‌ బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు 2025–-26 లో ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు  తమ ఖాతాదారుల నుంచి ఏకంగా రూ.4,948.71 కోట్లను చార్జీల రూపంలో వసూలు చేశాయి. ఈ విషయాలను రాజ్యసభలో  కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం వివరించారు.  

పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఈ రూపంలో రూ.2,138 కోట్లు వసూలు చేశాయని అన్నారు. ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ డేటా ప్రకారం, ప్రైవేట్ బ్యాంకుల్లో హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్ అత్యధికంగా రూ.1,798.14 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ.1,081.33 కోట్లు వసూలు చేశాయి. ప్రైవేట్ రంగానికి చెందిన 19 బ్యాంకులు వసూలు చేసిన మొత్తంలో ఈ రెండు బ్యాంకుల వాటానే 58 శాతంగా ఉంది. ప్రధానమంత్రి జన్‌‌‌‌‌‌‌‌ధన్ యోజన (పీఎంజేడీవై) సహా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌‌‌‌‌‌‌‌బీడీ) ఖాతాలపై ఎటువంటి జరిమానా చార్జీలు విధించలేదని మంత్రి స్పష్టం చేశారు.

మొండిబాకీలు దిగొచ్చాయ్‌‌‌‌‌‌‌‌..

ప్రభుత్వ బ్యాంకుల నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్ (గ్రాస్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌పీఏలు) దశాబ్దాల కనిష్టానికి చేరాయని, ప్రస్తుతం వాటి ఆర్థిక పరిస్థితి స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉందని పంకజ్‌‌‌‌‌‌‌‌ చౌదరి తెలిపారు. అలాగే పశ్చిమాసియా సంక్షోభం కారణంగా వ్యాపారాలు ఎదుర్కొంటున్న తాత్కాలిక నగదు కొరతను అధిగమించడానికి ఈ ఏడాది మేలో ప్రభుత్వం 'ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్5.0' తెచ్చిందన్నారు. ఈ పథకం ద్వారా ఎంఎస్‌‌‌‌‌‌‌‌ఎంలకు 100శాతం, ఇతర సంస్థలకు 90శాతం గ్యారెంటీ కవరేజ్ ఇస్తున్నామని వివరించారు.