పద్మారావునగర్, వెలుగు: ‘సర్’ను సవ్యంగా నిర్వహించేందుకు మరో 6 నెలలు గడువు పొడిగించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. మంగళవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 3తో గడువు ముగుస్తుందని, ఇప్పటివరకు సర్ ప్రక్రియ 40 శాతమే అయిందన్నారు.
సిబ్బంది కొరత ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను విధుల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు. ఫామ్‌ల కొరతపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తగినన్ని ఫామ్‌లు అందుబాటులో ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
