భూపాలపల్లి జిల్లాలోని గణపసముద్రం కాల్వల అభివృద్ధికి రూ.31 కోట్లు

భూపాలపల్లి జిల్లాలోని గణపసముద్రం కాల్వల అభివృద్ధికి రూ.31 కోట్లు

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లాలోని గణపసముద్రం పంట కాల్వల అభివృద్ధికి ప్రభుత్వం రూ.31 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గణపురం రైతు వేదికలో నిర్వహించిన 'రైతు నేస్తం' 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో ఆయన కలెక్టర్​ రాహుల్​శర్మ, డీఏదో బాబురావు, ఇతర ఆఫీసర్లతో కలిసి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టెండర్ ప్రక్రియ పూర్తైన తర్వాత 12 నెలల్లో కాల్వల పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఎల్‌‌‌‌నినో ప్రభావంతో వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.