హసన్ పర్తి: కృత్రిమ మేధస్సుతో భవిష్యత్లో కీలకమార్పులు

హసన్ పర్తి: కృత్రిమ మేధస్సుతో  భవిష్యత్లో కీలకమార్పులు

హసన్ పర్తి, వెలుగు :  కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని ప్రభావితం చేసే కీలక సాంకేతికతగా మారుతోందని ఇన్ఫోసిస్ సీనియర్ డైరెక్టర్ రవి అప్పయ్య అన్నారు. హనుమకొండ జిల్లా హసన్‌‌‌‌పర్తి మండలం అనంతసాగర్‌‌‌‌లోని ఎస్ఆర్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో, ఐఈఈఈ సహకారంతో నిర్వహిస్తున్న 7వ అంతర్జాతీయ స్మార్ట్ సిస్టమ్స్ అండ్ ఇన్వెంటివ్ టెక్నాలజీ కాన్ఫరెన్స్ మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రవి అప్పయ్య మాట్లాడుతూ పరిశోధకులు నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ వినూత్న సాంకేతిక పరిష్కారాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. 

కాన్ఫరెన్స్ చైర్మన్ డా.రవిచందర్ జనపాటి మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు, స్మార్ట్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి రంగాల్లో పరిశోధనలకు ఈ సదస్సు వేదికగా నిలుస్తోందన్నారు. ప్రొఫెసర్ వి.మహేశ్​మాట్లాడుతూ సమాజ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరగాలని, విద్యా సంస్థలు-పరిశ్రమల మధ్య సమన్వయం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డా.ఎ.వి.వి. సుధాకర్, డీన్ ప్రొఫెసర్ శశికళ మార్త, హెచ్‌‌‌‌వోడీ డా. చి. సందీప్ తదితరులు పాల్గొన్నారు.