సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : ఎస్ఎస్ ఎంప్లాయీస్ సంఘం

సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి : ఎస్ఎస్ ఎంప్లాయీస్ సంఘం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెల రోజుల్లోపు ఉద్యోగులను  సచివాలయానికి ఆహ్వానించి పే స్కేల్ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇచ్చిన హామీలు నీటిమూటలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

2023 సెప్టెంబర్13న హన్మకొండలో సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు నాటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి శిబిరానికి వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తామని తమకు హామీనిచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక 2025 జనవరిలో సమ్మె సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్యోగులతో చర్చలు జరిపి సమ్మె విరమణ ఒప్పందం చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. అనేక అంశాలపై రాతపూర్వక హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదన్నారు.