వరంగల్‌కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ మట్టెవాడ అజయ్ కుమార్ మరో అద్భుతాన్ని సృష్టించారు. సుమారు 80 నుంచి 100 మైక్రాన్ల వెడల్పు మాత్రమే ఉండే మనిషి తల వెంట్రుకపై 150 మైక్రాన్ల ఎత్తులో గణపతి విగ్రహాన్ని చెక్కారు. గణనాథుడి మెడలో గొలుసు, చేతిలో లడ్డూ కూడా స్పష్టంగా కనిపించేలా తీర్చిదిద్దడం విశేషం. ఈ శిల్పాన్ని మైక్రో స్కోప్ లో మాత్రమే చూసే అవకాశం ఉంది. విగ్రహాన్ని రూపొందించడానికి సుమారు 30 గంటల సమయం పట్టిందని ఆర్టిస్ట్ అజయ్ కుమార్ తెలిపారు.
