- అటెండ్ కానున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) 79 ఏండ్లు పూర్తి చేసుకుని 80వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల 27న హైదరాబాద్‌లో ఎస్టీయూ వైభవోత్సవం నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ వెల్లడించారు. వైభవోత్సవానికి ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులను ఆహ్వానించినట్లు తెలిపారు. ఆదివారం ఎస్టీయూ ఆఫీసులో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్‌తో కలిసి పోస్టర్లను రిలీజ్ చేశారు.
సదానందం మాట్లాడుతూ.. గడిచిన 8 దశాబ్దాలుగా టీచర్ల పక్షాన నిలబడి నిరంతరం పోరాడుతూ ఎన్నో సమస్యలను పరిష్కరించిన ఘనత ఎస్టీయూకు దక్కుతుందన్నారు. నిజాం కాలంలో ప్రారంభమైన ఈ సంఘం, టీచర్ల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో నేతలు పర్వత్ రెడ్డి, సాబేర్ ఆలీ, సుధాకర్, శ్రీధర్, రంగారావు, శంకర్, పోల్‌రెడ్డి పాల్గొన్నారు.
