ఎడ్‌‌‌‌‌‌‌‌సెట్ సెకండ్ ఫేజ్లో 7,049 మందికి సీట్లు

ఎడ్‌‌‌‌‌‌‌‌సెట్ సెకండ్ ఫేజ్లో 7,049 మందికి సీట్లు
  • 19లోగా కాలేజీల్లో రిపోర్ట్ కు గడువు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీఎడ్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీ ఎడ్‌‌‌‌‌‌‌‌సెట్ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తయింది. కన్వీనర్ కోటాలో 10,238 సీట్లకు 7,049 మంది అభ్యర్థులకు (స్లైడింగ్‌‌‌‌‌‌‌‌తో కలిపి) సీట్లు అలాట్ అయినట్టు అడ్మిషన్ల కన్వీనర్ పాండురంగా రెడ్డి ఆదివారం తెలిపారు.

రెండో విడత కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌లో మొత్తం 9,917 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, వారిలో 7,049 మందికి సీట్లు లభించాయి. కాగా, సెకండ్ ఫేజ్​లో సీట్లు పొందిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజు రశీదు, జాయినింగ్ రిపోర్టుతో ఈ నెల 19 వరకూ కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.