- అసెంబ్లీ గేట్ వద్ద ఘటనపై విచారణకు హాజరుకావాలని ఆదేశం
సైఫాబాద్, వెలుగు: అసెంబ్లీ గేట్ నంబర్–3 వద్ద ఈ నెల 7న చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేశ్ సోమవారం సైఫాబాద్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు రావాలని పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు.
ఈ ఘటనపై మహేందర్‌రెడ్డి, మహేశ్‌పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఇద్దరికీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వారిపై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను అనుసరించి సైఫాబాద్ పోలీసులు మహేందర్‌రెడ్డి, మహేశ్‌కు నోటీసులు జారీ చేశారు.
