బ్రిక్స్ విందు మెనూపై రాహుల్ గాంధీ విమర్శ... నాన్‌‌‌‌‌‌‌‌ వెజ్‌‌‌‌‌‌‌‌ వంటకాలు పెట్టకపోవడంపై ఆగ్రహం

బ్రిక్స్ విందు మెనూపై రాహుల్ గాంధీ విమర్శ... నాన్‌‌‌‌‌‌‌‌ వెజ్‌‌‌‌‌‌‌‌ వంటకాలు పెట్టకపోవడంపై ఆగ్రహం

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విందులో శాకాహార వంటకాలను మాత్రమే వడ్డించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. దేశంలో 80 శాతం మంది మాంసాహారులే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. విదేశీ అతిథులపై కేంద్రం తన ఆహారపు అలవాట్లను రుద్దుతోందని ఆరోపించారు. ‘‘దేశంలో 80% మంది మాంసాహారులే. భారతదేశపు నాన్‌‌‌‌‌‌‌‌వెజ్ వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. 

అలాగే, మా చెల్లెలు (ప్రియాంక గాంధీ) చేసే చోలే భటూరే కూడా చాలా అద్భుతంగా ఉంటాయి’’ అని పేర్కొంటూ చోలే భటూరే ఫొటోను పంచుకున్నారు. రాహుల్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మద్దతు పలికారు. 

కాగా, కాంగ్రెస్ విమర్శలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. భారతీయ సంప్రదాయాలు, పోషక విలువలు ఉట్టిపడేలా సిద్ధం చేసిన శాకాహార వంటకాలను విదేశీ నేతలు ఎంతో ఇష్టపడి తిన్నారని తెలిపారు.