VijayRashmika: సంగీత్ వేడుకలో 'వీడు మొరటోడు' పాటకు ' రష్మిక క్రేజీ డ్యాన్స్.. మురిసిపోయిన విజయ్ దేవరకొండ!

VijayRashmika: సంగీత్ వేడుకలో 'వీడు మొరటోడు' పాటకు ' రష్మిక క్రేజీ డ్యాన్స్.. మురిసిపోయిన విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహ వేడుకలు ఘనంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా అంబరాన్నంటుతున్నాయి. వెండితెరపై మాయాజాలం చేసిన జంట.. ఇప్పుడు నిజజీవితంలో ఒక్కటి కాబోతున్నారు.  అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘విరోష్’ (VIROSH) వివాహం ఫిబ్రవరి 26న (గురువారం) అత్యంత వైభవంగా జరగనుంది. వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఉదయ్‌పూర్‌లో హల్దీ సందడి

బుధవారం (ఫిబ్రవరి 25)  విజయ్-రష్మికల హల్దీ వేడుక అత్యంత రమణీయంగా జరిగింది. అరవల్లి కొండల మధ్య ఉన్న 'మెమెంటోస్ బై ఐటిసి' హోటల్‌లో ప్రకృతి ఒడిలో ఈ వేడుకను నిర్వహించారు. వేదికనంతా పసుపు పచ్చని బంతి పూలు, గులాబీ రేకులతో అలంకరించారు. ఈ సందర్భంగా విజయ్, రష్మిక ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ ఆడారు. ఈ వేడుకలో బంధువులు, సన్నిహితులు, పలువురు సినీ సెలబ్రిటీలు పొల్గొని సందడి చేశారు.  దీనికి సంబంధించిన ఫోటోలను వారు ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. తమ ముద్దుపేర్లయిన 'రుషీ', 'విజయ్' అని ఉన్న ఫ్లవర్ కార్డ్స్ పోస్ట్ చేశారు. ఈ వేడుకలో  నటి అశికా రంగనాథ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

 

సంగీత్ వేడుకలో 'శ్రీవల్లి' డ్యాన్స్

సంగీత్ వేడుకలో రష్మిక మందన్న తన ప్రదర్శనతో స్టేజ్ పై అలరించారు. తన కాబోయే భర్త విజయ్ కోసం 'పుష్ప 2' చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ 'వీడు మొరటోడు' పాటకు స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రష్మిక డ్యాన్స్ చూసి విజయ్ ముగ్ధుడైపోగా, అతిథులందరూ ఈలలు, కేకలతో హోరెత్తించారు. 

 

ఉద్వేగానికి లోనైన విజయ్ తల్లి

ఈ వేడుకల్లో రష్మిక పర్ఫామెన్స్ చూసిన విజయ్ దేవరకొండ తల్లి మాధవీ దేవరకొండ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే రష్మికను దగ్గరకు తీసుకుని, ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని "మై డార్లింగ్ రుషీ.." అంటూ ఆశీర్వదించారు. అత్తా కోడళ్ల మధ్య ఉన్న ఈ అనుబంధం చూసి అక్కడి వారంతా మురిసిపోయారు.

►ALSO READ | Vijay-Rashmika Wedding: విజయ్ రష్మికల కళ్యాణ ముహూర్తం ఇదే.. ముచ్చటగా రెండు పద్ధతుల్లో పెళ్లి!

'విరోష్' వెడ్డింగ్ - 
తమ పెళ్లికి ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టడం వెనుక ఉన్న ప్రేమను ఈ జంట పంచుకున్నారు. "మాకంటే ముందే మా ఇద్దరినీ కలిపి మీరు 'విరోష్' అని పిలిచారు. ఆ పేరులోనే మా ప్రేమ ఉంది. అందుకే మా ఈ కొత్త ప్రయాణానికి మీరిచ్చిన పేరునే పెట్టుకున్నాం" అంటూ ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పారు. 

 

అతిథులు ..
ఈ కొత్త జంటకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం శుభాకాంక్షలు తెలపారు. అటు టాలీవుడ్ నుండి దర్శకులు తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, నటి ఈషా రెబ్బా సహా పలువురు ప్రముఖులు ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొని సందడి చేవారు..  రెండు వేర్వేరు సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి జరగనుంది. పెళ్లి ముగిసిన తర్వాత హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, రాజకీయ నేతల కోసం అత్యంత భారీ స్థాయిలో రిసెప్షన్ నిర్వహించనున్నారు.