ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే, చిరునామాల్లో లేని, ఆచూకీ, వివరాలు లభ్యం కాని ఓటర్లు రాష్ట్రంలోనే అత్యధికంగా కడప, కర్నూలు, తిరుపతి, చంద్రగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఉన్నట్లు సర్ ప్రక్రియలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మొత్తం 1,77,885 మంది ఓటర్లు చిరునామాల్లో లేని, అచూకీ, వివరాలు లభ్యంకాని జాబితాలో ఉండగా.. అందులో 1,11,027 (14.27%) ఈ ఐదు జిల్లాల్లోనే ఉన్నట్లు వెల్లడైంది.
రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఆన్ సబుల్/ అబ్సెంట్ ఓటర్లు 1.87% మాత్రమే ఉండగా.. కడప నియోజ కవర్గంలోని మొత్తం ఓట్లలో 11.16, కర్నూలు నియో జకవర్గంలోని మొత్తం ఓట్లలో 7.72, తిరుపతిలో 8 85, చంద్రగిరిలో 6,15, నెల్లూరు రూరల్లో 6.48% ఉన్నట్లు వెలుగుచూసింది. ఇది అసాధారణం. వైకాపా హయాంలో ప్రధానంగా రాయలసీమలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించారనే ఆరోపణలున్నాయి. వీటిపై ప్రతిపక్షాలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదుచేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇన్నాళ్లుగా ఆ ఓట్లన్నీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు సర్తో ఇలాంటి ఓట్ల గుట్టు బయటపడింది.
మరణించినవారి ఓట్లు రంపచోడవరంలో ఎక్కువ..
మృతులు ఓట్లు ఇప్పటికీ జాబితాలో కొనసాగుతు న్నట్టు 'సర్చై తేలింది. రంపచోడవరం నియోజకవ ర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా మృతుల ఓట్లున్నాయి. తర్వాతి స్థానాల్లో అరకు, ఇచ్ఛాపురం, పాడేరు, కోవూరు నియోజకవర్గాలున్నాయి. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో మృతుల ఓట్లు 3. 50% ఉన్నాయి. కానీ దంపచోడవరం, అరకుల్లో అక్కడి మొత్తం ఓటర్లలో మృతుల ఓట్లు 7% దాటాయి. ఇచ్ఛా పురం, పాడేరుల్లో మృతుల ఓట్లు 6% పైగా ఉన్నాయి.
తొలగించాల్సినవి తిరుపతి, కర్నూలు, కడవల్లోనే అధికం..
రాష్ట్రవ్యాప్తంగా... 1.16,27,664 మంది ఓటర్లకు 44,89,488 (H1.18%) ఓట్లను తొలగించాల్సిన జాబి తాలో ఎన్నికల సంఘం చేర్చింది. అందులో 2,42,477 ఓట్లు (7.62%) తిరుపతి, కర్నూలు, కడప, నెల్లూరు రూరల్, గుంటూరు పశ్చిమల్లోనే ఉన్నాయి. తిరుపతి నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో మూడోవంతు తొలగించాల్సిన జాబితాలోనే ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలోనే అత్యధికంగా 30882 ఓట్లు తొలగం చాల్చిన జాబితాలో చేర్చారు. దీన్ని బట్టి ఇక్కడ ఏ స్థాయిలో దొంగ ఓట్లున్నాయో అర్థం చేసుకోవచ్చు. కర్నూలు, కడప నియోజకవర్గాల్లోనూ 85వేలకు పైగా ఓట్లు తొలగించాల్సిన జాబితాలో ఉన్నాయి.
చంద్రగిరిలోనే ఎక్కువగా నో మ్యాపింగ్..
సర్లో భాగంగా.. ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాల్లో వారి వివరాలు నింపి బీఎల్వోలకు అందజేయాలి. చాలామంది 2002 నాటి జాబితాలోని తమ సంబబంధీ కుల వివరాలతో మ్యాపింగ్ చేసుకోకుండా కచో మ్యాపింగ్) పత్రాలను బీఎల్వాలకు ఇచ్చేశారు. ఇలాంటి ఓటర్లు రాష్ట్రంలోనే అత్యధికంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నారు. తర్వాత తిరుపతి, అనంత పురం అర్బన్, కడప, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఎక్కువమంది ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నో మ్యాపింగ్ విభాగంలో మొత్తం 756,344 మంది ఓటర్లు ఉండగా అందులో 1,77,496 మంది (22.16%) ఈ ఐదుచోట్లే ఉన్నారు. వీరిలో ఎక్కువమంది అనుమానాస్పద ఓటర్లే చంద్రగిరి నియోజకవర్గంలో నో మ్యాపింగ్ విభా గంలో అసాధారణంగా 50 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు.
పాణ్యంలో అత్యధికంగా ఒకే వ్యక్తికి రెండేసి ఓట్లు ..
ఒకే వ్యక్తికి రెండేసి ఓట్లు (డబుల్ ఎంట్రీలు) అత్య ధిరంగా ఉన్న నియోజకవర్గాల్లో రాష్ట్రంలో మొదటిస్థా నంలో పాణ్యం ఉంది. తర్వాత కర్నూలు, అనంతపురం అర్బన్, పెనమలూరు, నెల్లూరు సిటీ ఉన్నాయి. శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లు రాష్ట్రంలోనే అత్య ధికంగా తిరుపతి నియోజకవర్గంలోనే ఉన్నారు. ఇక్కడ మొత్తం 2,35,288 మంది ఓటర్లు ఉండగా.. అందులో 57,256 (19.39%) శాశ్వత వలసలు వెళ్లిపోయినట్లు పరిశీలనలో తేలింది. ఈ విషయంలో రాష్ట్ర సగటు 9.47% మాత్రమే.
