T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస మైదానంలో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్ లో 61 పరుగులు తేడాతో గెలిచి గ్రూప్–2లో రెండో స్థానంలో నిలిచింది. అంతకు ముందు టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ తీసుకోవడంతో.. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కాగా న్యూజిలాండ్ బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (47), రచిన్ రవీంద్ర (32), కోల్ మెక్‌కాన్చీ (31), ఫిన్ అలెన్ (23) రాణించారు. అయితే న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (8), డారిల్ మిచెల్ (3), మార్క్ చాప్మన్ (0) ఘోరంగా విఫలమయ్యారు.
169 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక జట్టు ఓపెనర్ పథుమ్ నిశాంక (0) మరోసారి నిరాశ పరిచాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్ లో క్లిన్ బౌల్డ్ అయి, గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన లంక బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కి క్యూ కట్టారు. శ్రీలంక బ్యాటర్లలో కమిందు మెండిస్ (31) ఒక్కడే కాసేపు న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పటికీ, కుశల్ మెండిస్ (11), పవన్ రత్నాయకే (10), చరిత్ అసలంక (5), కెప్టెన్ దసున్ శనక (3), దుషన్ హేమంత (3) ఏమాత్రం పోటీ ఇవ్వకపోగా తక్కువ పరుగులకే డగౌట్ కి వెళ్లిపోయారు.
►ALSO READ | SL vs NZ: న్యూజిలాండ్ బ్యాటర్లను వణికించిన శ్రీలంక.. స్కోర్ ఎంతంటే?
మరోవైపు లంక బ్యాటర్లు అందరు వరుసగా పెవిలియన్ కి క్యూ కట్టిన కూడా దునిత్ వెల్లలాగే మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సుతో 29 పరుగులు చేసి గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్ లో రచిన్ రవింద్రకు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక పరుగులకే ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో రచిన్ రవీంద్ర కీలకమైన 4 వికెట్లు తీసుకుని లంక జట్టు వెన్ను విరిచి సాంట్నర్ సేన విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు తీసుకోగా, మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ చెరో వికెట్ పడగొట్టారు. దీంతో శ్రీలంక జట్టు 8 వికెట్ల నష్టానికి 107 పరుగులే చేసి.. 61 పరుగుల తేడాతో ఘరంగా ఓడింది.
