కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ-20 క్రికెట్ టోర్నమెంట్ లో పెద్దపెల్లి జిల్లా జట్టుపై కరీంనగర్ జిల్లా జట్టు 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని నాలుగు జట్లలో కరీంనగర్ జట్టు టాప్ స్థానానికి చేరుకుంది .
డిసెంబర్ 25న ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది కరీంనగర్ జిల్లా జట్టు. అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పెద్దపల్లి జట్టు 17.5 ఓవర్లలో కేవలం 61 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. 60 పరుగులు చేసిన కరీంనగర్ జిల్లా జట్టుకు చెందిన బ్యాట్స్ మన్ సయ్యద్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తోపాటు గెలుపొందిన జట్టుకు షీల్డ్ అందజేశారు కరీంనగర్ నగర మాజీ మేయర్ సునీల్ రావు, కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు.
రాజన్న సిరిసిల్ల- జగిత్యాల జిల్లా జట్ల మధ్య మరో మ్యాచ్ ప్రారంభం అయ్యింది. ఇవాల్టితో టాప్ 2లో మిగిలిన జట్ల మధ్య డిసెంబర్ 26న మరొక మ్యాచ్ జరగనుంది. రేపటి మ్యాచ్ అనంతరం విన్నింగ్ జట్టుకు ట్రోపీని అందజేయనున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
