ఫ్లైఓవర్ పై ఆగివున్న కారులో మూడు మృతదేహాలు..ఆత్మహత్యా? లేక హత్యా?

ఫ్లైఓవర్ పై ఆగివున్న కారులో మూడు మృతదేహాలు..ఆత్మహత్యా? లేక హత్యా?

ఫ్లైఓవర్​ ఆగివున్న కారు.. అనుమానం వచ్చి డోర్​ ఓపెన్ చూసిన కమ్యూటర్స్​షాక్​..కారులో చెల్లాచెదరుగా మూడు మృతదేహాలు..ఆదివారం(ఫిబ్రవరి 8) ఢిల్లీలోని పీర్​గడీ ఫ్లైఓవర్​పై ఆగివున్న కారులో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. సంఘటనస్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుల్లో ఒకరు మహిళ, ఇద్దరు పురుషులున్నట్లు వెల్లడించారు. 

ఒకే కారులో ముగ్గురు విగతజీవులుగా ఉండటంపై పోలీసులు పలు అనుమానం వ్యక్తం చేశారు. హత్యా లేక ఆత్మహత్యా అనేకోణంలో విచారణ చేపట్టారు. మరోవైపు చోరీకోసం వారిని ఎవరైనా హత్య చేసి ఉంటారా  అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే ముగ్గురు వ్యక్తులు విష ప్రయోగం కారణంగా చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టమ్​ కోసం డెడ్​ బాడీలను ఆస్పత్రికి తరలించారు. ఇప్పటివరకు మృతుల్లో ఒకరిని  గుర్తించారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది. 

ఢిల్లీలోని పీరాగఢి ప్రాంతంలో పార్క్ చేసిన కారులో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.ప్రాథమిక నివేదికల ప్రకారం మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల్లో మహిళ, ఒక పురుషుడు దాదాపు 40 ఏళ్ల వయస్సు గలవారు కాగా, మూడో వ్యక్తి 60 ఏళ్లు వయసు ఉంటుందని భావిస్తున్నారు.

సంఘటన స్థలంలో దోపిడీ లేదా పెనుగులాటకు సంబందించి ఎలాంటి సంకేతాలను లేకపోవడంతో మృతులపై విషప్రయోగం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మూడు మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్ష కోసం ఆస్పత్రికి పంపారు.దర్యాప్తు కొనసాగుతోంది.