2026 స్వాతంత్ర్య దినోత్సవం వచ్చేసింది. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే ఉన్న సందర్భంగా.. ఇది ఎన్నో స్వాతంత్ర్య దినోత్సవం అనే కన్ఫ్యూ జన్ ఉంటుంది. 79వదా లేక 80వదా..? కొందరు 79 అంటుంటే మరికొందరు 80 ఇండిపెండెన్స్ డే అంటుండటంతో చాలా మందికి కన్ఫూజన్ ఏర్పడటం కామన్. క్లారిటీ ఏంటో తెలుసుకుందాం.
బ్రిటిష్ పాలన నుంచి ఇండియాకు స్వాతంత్ర్యం 1947, ఆగస్టు 15వ తేదీన వచ్చింది. అప్పటి నుంచి లెక్కిస్తే 2026 ఆగస్టు 15 వరకు 79 సంవత్సరాలు పూర్తవుతుంది. 2026 నుంచి 1947 తీసివేస్తే కూడా 79 అని వస్తుంది.
అయితే ఈ విషయంలో కన్ఫ్యూజన్ కు కారణం.. 1947 నుంచి లెక్కింపుతో ఇయర్స్ ను లెక్కించినట్లు కాదు. కేవలం ఎన్ని సార్లు ఇండిపెండెన్స్ డే చేస్తున్నాము అనే దానికి సరిపోతుంది. ఎందుకంటే.. 1947 ఆగస్టు 15 అనేది స్వాతంత్ర్యం వచ్చిన తేదీ మాత్రమే. ఆ తేదీ ప్రకారం ఏడాది పూర్తి అయినట్లు కాదు.
ఈ లెక్కన 1947 నుంచి లెక్కపడితే.. 1947 ఒకటవది. 1948 2వది. ఆ రకంగా 2025 ఏడాదికి 79వ స్వాతంత్ర్య దినోత్సవం అవుతుంది. ఆ తర్వాత 2026 అనేది 80 ఇండిపెండెన్స్ డే అవుతుంది. అంటే వేడుక ప్రకారం.. ఇది ఎన్నో ఇండిపెండెన్స్ అంటే 80 అనేది క్లియర్. మరి 79 ఎలా అనే డౌట్ కూడా రావచ్చు.
79.. లేక 80..? ఏది కరెక్ట్
స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది అంటే 79 ఏండ్లు అని చెప్పవచ్చు. అలా కాకుండా నెంబర్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు వచ్చే ఇండిపెండెన్స్ డే ఎన్నవది అంటే 80వది అని చెప్పవచ్చు. ఈ లెక్కింపులో వస్తున్న ఒక ఏడాది గ్యాప్ అనేది పూర్తిగా.. ఫస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఆధారం చేసుకుని ఆలోచించడం వలనే. సో.. ఈ స్వాతంత్ర్య దినోత్సవం ఎన్నవది అంటే 80.. ఎన్నేళ్లు పూర్తయింది అంటే 79 అని క్లారిటీ ఉంటే చాలు.
